![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -367 లో.. అందరు డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చెయ్యడానికి కూర్చొని ఉంటారు. రాజ్ ఇంకా రావడం లేదు.. రావడానికి మొహం చెల్లడం లేదేమోనని రుద్రాణి అనగానే.. రాజ్ నీ కొడుకు లాగా దులుపెసుకొని రాలేడని ప్రకాష్ అంటాడు. నా కొడుకు చేసిన తప్పు ఒప్పుకొని స్వప్నని పెళ్లి చేసుకున్నాడు. రాజ్ లాగా తల్లిని చేసి తల్లిని వదిలేసి బిడ్డతో రాలేదని రుద్రాణి అంటుంటే.. అపర్ణకు కోపం వస్తుంది.
ఆ తర్వాత అప్పుడే రాజ్ భోజనం చెయ్యడానికి వస్తాడు. రాజ్ వడ్డించుకొని భోజనం చేస్తుంటే.. అపర్ణ వెళ్లిపోతుంటుంది. నేనే వెళ్తాను.. నువ్వు భోజనం చెయ్ అని అపర్ణతో రాజ్ అంటాడు. ఆ తర్వాత రాజ్ భోజనం చెయ్యకుండా వెళ్ళిపోతాడు. అపర్ణ భోజనం చేయబోతు ఆగిపోయి.. భోజనం వదిలేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సుభాష్ , ఇందిరాదేవి ఇద్దరు కూడ భోజనం చేయకుండా వెళ్లిపోతారు. ఆకలిగా ఉందంటూ రుద్రాణి, రాహుల్, ధాన్యలక్ష్మి అనామికలు కలిసి భోజనం చేస్తుంటే.. మీకు సిగ్గు లేదా అంటూ ప్రకాష్ అనగానే వాళ్ళు కూడా భోజనం చేయకుండ వెళ్ళిపోతారు. ఆ తర్వాత రాజ్ కోసం కావ్య భోజనం తీసుకోని వెళ్తుంటే అపర్ణ వచ్చి.. నువు ఒక్కదానివే వాడి దృష్టిలో మంచిదానిలాగా ఉండాలని ఇలా చేస్తున్నావా అని కావ్యతో అంటుంది. ఇలా అందరూ వదిలేస్తే అసలు నిజం ఎవరు అడుగుతారు.. ఇలా చేస్తే అయిన చెప్తారేమోనని ఆశ అని కావ్య చెప్తుంది.
ఆ తర్వాత రాజ్ దగ్గరకి కావ్య వెళ్లి భోజనం ఇస్తుంది. ఇప్పటికైనా నిజం చెప్పండి.. ఇంట్లోవాళ్ళని ఎందుకు బాధపెడుతున్నారని రాజ్ తో కావ్య అడుగుతుంది. కానీ రాజ్ ఏలాంటి సమాధానం చెప్పడు. మరొకవైపు ఆకలి అంటూ రాహుల్, రుద్రాణి, ధాన్యలక్ష్మి, అనామికలు నిద్రపోరు. దాంతో రాహుల్ ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తాడు. ఆ డెలివరీ బాయ్ వచ్చేసరికి ప్రకాష్ బయటే ఉండడంతో.. రాహుల్ అనేవాళ్ళు ఎవరు లేరని చెప్పి ఇంట్లో ఉన్న భోజనం కూడా డెలివరీ బాయ్ కి ఇస్తాడు. దాంతో అదిపోయే, ఇదిపోయే అంటు ఆ తోడుదొంగలంతా బిక్కమొహం వేస్తారు. తరువాయి భాగంలో బాబు ఏడుస్తుంటే కావ్య చూడలేక.. బాబుకి ఉగ్గు తినిపించలని చెప్తుంది. కాసేపటికి బాబుకి కళ్యాణ్ ఫుడ్ తీసుకొని రావడం.. ఇంట్లో వాళ్ళందరు చూస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |